: జగన్ ను కలిసేందుకు హైదరాబాద్ బయలుదేరిన శిల్పా చక్రపాణి... రేపు భారీ బహిరంగ సభలో వైకాపా కండువా!


ఈ ఉదయం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి, హైదరాబాద్ లో ఉన్న వైకాపా అధినేత వైఎస్ జగన్ ను కలిసేందుకు ముఖ్య అనుచరులతో కలసి బయలుదేరారు. ఈ మధ్యాహ్నం తరువాత జగన్ ను కలసి చర్చించనున్న ఆయన, రేపు నంద్యాలలో జరిగే భారీ బహిరంగ సభలో వైకాపా తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో శ్రీశైలం అసెంబ్లీ టికెట్ ఖాయం చేసుకున్న తరువాత ఆయన టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదే డిమాండ్ ను ఆయన తెలుగుదేశం ముందు కూడా ఉంచినప్పటికీ, సరైన స్పందన రాలేదన్న సంగతి తెలిసిందే. ఇక చక్రపాణి రెడ్డి టీడీపీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారా? అన్న విషయమై స్పష్టత లేదు.

  • Loading...

More Telugu News