: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం... ఎగసిపడుతున్న మంటలు
కృష్ణా జిల్లా విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విజయవాడలోని ఆటోనగర్ లోని ఒక ఆయిల్ కంపెనీలో మంటలు చెలరేగి, ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో దాని చుట్టుపక్కల ప్రాంతప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా అంచనాకు రావాల్సి ఉంది. ప్రమాదతీవ్రత పెరగకుండా ఉండేందుకు ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.