: గాలిలో గంగ హారతి... వీడియో చూడండి!
హైడ్రాలిక్ పంప్ జెట్ సాయంతో గంగా నదికి హారతినిస్తూ తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. జెట్ మీద కదులుతూ నాలుగు దిక్కుల్లో గంగకు హారతినిచ్చాడు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాక పోయినా ఇది సోషల్ మీడియాలో లైకుల కోసం చేసిన వీడియో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొత్తదనం కోసం ఇలాంటి వీడియోలు ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇటీవల ఓ వీడియోగేమ్‌లో టాస్క్‌లు పూర్తి చేయడం కోసం భవనం మీద నుంచి దూకి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే!