: బిగ్ బాస్ లో తనకు విధించిన లక్షల రూపాయల పెనాల్టీపై స్పందించిన సంపూర్ణేష్ బాబు!


జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో నుంచి హీరో సంపూర్ణేష్ బాబు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అతనిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. బిగ్ బాస్ రూల్స్ ను సంపూ అతిక్రమించాడని... అతనికి రూ. లక్షల్లో పెనాల్టీ విధించారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బర్నింగ్ స్టార్ తెరదించాడు. పెనాల్టీ విధించినట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని సంపూ ట్వీట్ చేశాడు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పాడు. షోలో పాల్గొనడానికి తనకు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ వారికి, స్టార్ మా ఛానల్ కు ధన్యవాదాలు తెలిపాడు.

మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ పై సంపూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు భుజం తట్టి, ధైర్యం నింపేవాడే నిజమైన హీరో అయిన తెలిపాడు. జూనియర్ ఎన్టీఆరే తనకు నిజమైన బిగ్ బాస్ అని చెప్పాడు. షో నుంచి బయటకు వచ్చి ప్రేక్షక దేవుళ్లను నిరాశపరిచానని.... అందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News