: మాకో ఇష్టమైన కష్టం ఎదురుకానుంది: విరాట్ కోహ్లీ
లంకతో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్ గా అభినవ్ ముకుంద్ రాణించడంతో, జట్టులో ఓపెనర్ల స్థానాలకు గట్టి పోటీ నెలకొని ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండో టెస్టులో తొలి ఇద్దరు బ్యాట్స్ మెన్ల ఎంపిక తమకెంతో క్లిష్టతరమైన ప్రక్రియగా అభివర్ణించాడు. ఇది తమకు ఇష్టమైన కష్టం వంటిదని, మారిన పరిస్థితుల నేపథ్యంలో, పిచ్ ని పరిశీలించిన తరువాత ఓపెనింగ్ జోడీపై నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నాడు. జట్టులో స్థానం కోసం ఆరోగ్యకరమైన పోటీ ఉందని తెలిపాడు. రెండేళ్ల క్రితం లంకలో గెలవాల్సిన ఓ మ్యాచ్ ని తాము ఓడిపోయామని, ఈ విజయంతో నాటి పరాజయాన్ని మరచామని అన్నాడు.