: విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. త్రుటిలో తప్పిన ప్రమాదం!
150 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ముంబై నుంచి జోధ్ పూర్ వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం 150 మంది ప్రయాణికులతో బయల్దేరింది. విమానం కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుందనగా, ఓ పక్షి విమానాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఏం జరిగిందోనని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే పైలట్ చాకచక్యంగా విమానాన్ని జోథ్ పూర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా ఆందోళన చెందినప్పటికీ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.