: ఫొటో తీస్తుండగా ఈ పిల్లాడు ఏం చేశాడో చూడండి... నవ్వు ఆపుకోలేరు!
అప్పుడే పుట్టిన పిల్లలు తెలియక చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. అలాంటి పనే ఈ పిల్లాడు కూడా చేశాడు. ఈ మధ్య ట్రెండ్‌గా మారిన నవజాత శిశువుల ఫొటోగ్రఫీ కోసం వాళ్లమ్మ అన్నీ సిద్ధం చేసింది. తీరా ఫొటోగ్రాఫర్ రెడీ అనే సమయంలో పిల్లాడు మూత్ర విసర్జన చేశాడు. పక్కనే ఉన్న సహాయకురాలు వచ్చి వాళ్లమ్మకు సహాయం చేస్తుండగా పిల్లాడు ఇంకో చిలిపి పని చేశాడు. ఇవేవీ పట్టించుకోకుండా ఫొటోగ్రాఫర్ వీడియో రికార్డు చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. ఇప్పటికే ఆ వీడియోను దాదాపు 2 లక్షల మంది వీక్షించారు. ఒత్తిడిలో పని చేసుకుంటున్న తమకు ఈ వీడియో ఆనందాన్ని పంచిందని చాలా మంది కామెంట్లు చేశారు. మీరు కూడా చూడండి మరి!