: బాలయ్యా సూపర్... 'పైసా వసూల్' స్టంపర్ పై వర్మ కామెంట్!
'పైసా వసూల్' స్టంపర్ బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో ఊహించనంత వేతంగా వ్యూస్ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు పూరీ డిఫరెంట్ గా చూపించారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటోంది. ఈ ఉదయం విడుదలైన స్టంపర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఈ నేపథ్యంలో, 'పైసా వసూల్' స్టంపర్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. 'సూపర్ సూపర్ డూపర్' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. బాలయ్యా సూపర్ అంటూ కితాబిచ్చాడు. తన జీవితంలోనే తొలిసారి బాలయ్యను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పాడు.