: ఏ క్షణంలోనైనా సిట్ నోటీసులు... రెండో జాబితాలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, బడా వ్యాపారవేత్తలు!


డ్రగ్స్ వ్యవహారంలో సిట్ విచారణతో ఇప్పటికే టాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. ఇప్పుడు మరోవార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లతో సిట్ రెండో జాబితాను సిద్ధం చేసిందని, జాబితాలో ఉన్న వారందరకీ ఏ క్షణంలోనైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జాబితాలో సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నేతలు, బడా వ్యాపారవేత్తల పేర్లు కూడా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. దీంతో, తొలి జాబితాలో లేని పలువురు సినీ ప్రముఖుల వెన్నులో వణుకు మొదలైంది. ఒకటి లేదా రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News