: నవాజ్ షరీఫ్ పదవి ఉంటుందా? ఊడుతుందా?.. ఈరోజు తేలనునున్న పాక్ ప్రధాని భవితవ్యం!
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ రాజకీయ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఆయన పదవి ఉంటుందా? లేక ఊడుతుందా? అనే విషయం ఈరోజు తేలిపోబోతోంది. పనామా పేపర్ల ద్వారా ఆయనపై వచ్చిన ఆరోపణలపై పాక్ సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి పాక్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. 1990లో షరీఫ్ పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డారని, అక్రమ సంపాదనతో లండన్ లో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారని, ఆయన కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఈ ఆస్తులను కొనుగోలు చేశారని పనామా పేపర్ల ద్వారా లీక్ అయింది. ఈ నేపథ్యంలో పాక్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షరీఫ్ తో పాటు ఆయన కుటుంబసభ్యులను విచారించి, కోర్టుకు నివేదిక సమర్పించింది. ఒకవేళ షరీఫ్ తప్పు చేసినట్టు తేలితే... ఆయన వెంటనే ప్రధాని పదవిని కోల్పోవడమే కాక, జైలు ఊచలను కూడా లెక్కబెట్టాల్సి ఉంటుంది.