: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం... టీఆర్ఎస్ నేత దుబ్బాక సతీశ్ రెడ్డి దుర్మరణం!
నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నేత దుబ్బాక సతీశ్ రెడ్డి దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్టణం నుంచి చిట్యాల వస్తుండగా నార్కట్‌పల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో సతీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. సతీశ్ రెడ్డి నల్గొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి సోదరుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.