sai pallavi: సూర్యతో నటించాలని ఉందన్న సాయిపల్లవి!

కాలేజ్ డేస్ లో అబ్బాయిలకి ఫేవరెట్ హీరోయిన్స్ ఉంటే .. అమ్మాయిలకి ఫేవరెట్ హీరోలు వుండటం సహజం. అలా తన కాలేజ్ డేస్ లో తాను ఎక్కువగా హీరో సూర్యను ఇష్టపడే దానినని 'ఫిదా' కథానాయిక సాయిపల్లవి చెప్పింది. కాలేజ్ డేస్ లో తాను ఎక్కువగా సూర్యను అభిమానించే దానినని అంది. ఆయన సినిమాలను వదలకుండా చూసేదానినంటూ చెప్పింది.

 సూర్యతో నటించాలని ఉందనీ .. ఆ అవకాశం వస్తే మాత్రం వదులుకోనని అంది. తన కల నిజమయ్యే రోజు వస్తుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 'ఫిదా' సినిమాలో తాను పోషించిన 'భానుమతి' పాత్రకి దక్కుతోన్న ప్రశంసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తన నటన చూసినవాళ్లు సావిత్రి .. సౌందర్యలతో పోలుస్తుండటం ఎప్పటికీ మరిచిపోలేనని అంది.
sai pallavi

More Telugu News