: సినీ తారలకు జరిగే నష్టాన్ని ఎవరు పూడుస్తారు?: రోజా

డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారిస్తున్న తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. సినీ ప్రముఖులను విచారిస్తున్న తీరు సరైంది కాదని అన్నారు. ఈ విచారణ ద్వారా సినీ ప్రముఖుల పరువు గంగపాలవుతోందని చెప్పారు. విచారణ అనంతరం సినిమావాళ్ల తప్పులేదని తేలితే... అప్పటికే సినీ తారలకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు. సినిమా వాళ్ల బతుకులు అద్దాల మేడలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మీడియా కూడా కొంచెం సంయమనం పాటించాలని కోరారు.

More Telugu News