: కొత్త దర్శకుడి సినిమా ‘కోకో’లో నయనతార
దక్షిణాది ముద్దుగుమ్మ నయనతార మరో చిత్రాన్ని అంగీకరించింది. నూతన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కోకో’ చిత్రంలో ఆమెకు అవకాశం లభించినట్టు సమాచారం. ఈ చిత్రంలో కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రను పోషించనున్న నయనతారకు జోడీగా ఎవరు ఉండరని తెలుస్తోంది. ఎందుకంటే, డార్క్ కామెడీ తరహాలో ఈ చిత్రం కొనసాగుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం.
కాగా, ప్రముఖ నటుడు బాలకృష్ణ సరసన నయనతార గతంలో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాల్లో నటించింది. ముచ్చటగా మూడోసారి బాలయ్య సరసన నటించే ఛాన్స్ ఆమె దక్కించుకుంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో బాలయ్య సరసన నయనతార నటించనుంది. ఇక, తమిళంలో ‘ఇమైక్క నోడిగల్’, ‘ఆరమ్’, ‘కోలయుత్తిర్ కాలమ్’, ‘వెలైక్కారన్’ వంటి చిత్రాలతో నయనతార ప్రస్తుతం బిజీగా ఉంది.