: విజయవాడ బంగారం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు... దొంగల్లో మాజీ కార్మికుడు!


విజయవాడలోని బీసెంట్ రోడ్డులోని బంగారం తయారీ కార్ఖానాలో 7 కేజీల బంగారం దోచుకెళ్లిన కేసును ఏపీ పోలీసులు ఛేదించారు. సీసీ పుటేజ్, దోపిడీ స్థలంలో వేలి ముద్రలు, వాడిన కారు, పాత నేరస్తుల సహకారంతో ఈ కేసును ఛేదించారు. ఈ కార్ఖానాను నిర్వహిస్తున్న వ్యక్తి పదేళ్ల క్రితం విజయవాడ వచ్చి, ఇక్కడే స్థిరపడ్డాడని పోలీసులు తెలిపారు. అయితే గతంలో ఇందులో పని చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికుడు తమిళనాడు, యూపీ, మహారాష్ట్రకు చెందిన దోపిడీ ముఠాతో కలిసి కార్మికులను బెదిరించి 7 కేజీల బంగారం ఎత్తుకెళ్లాడు.

దోపిడీకి ముందు షాపులో కార్మికులు డ్యూటీ మారే సమయం ఏమిటి, ఎంతమంది పని చేసే అవకాశం ఉంది? ఎలా వెళ్లాలి? ఎలా బయటపడాలి? వంటి అన్ని విషయాలపై ముందు రోజు రెక్కీ నిర్వహించి, ప్లాన్ అమలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. సమర్థవంతమైన దర్యాప్తు అనంతరం 8 మంది సభ్యులైన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేటి మధ్యాహ్నం వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 

  • Loading...

More Telugu News