: యూపీ ప్రభుత్వ ఆసుపత్రిలో డీజే డ్యాన్స్ లు.. ఇబ్బందిపడ్డ పేషెంట్లు!
యూపీ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఏర్పాటు చేసుకున్న పార్టీ, పేషెంట్లకు నిద్రపట్టకుండా చేసింది. రాంపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ వార్డు బాయ్ కుమారుడి బర్త్ డేను అక్కడి వైద్యులు, సిబ్బంది ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద కేక్ తెప్పించి, డీజే పార్టీ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది ఆట పాటలతో ఎంజాయ్ చేశారు. అయితే, పేషెంట్లకు మాత్రం నిద్రపట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. దీంతో, జిల్లా అధికారులు స్పందించారు. పేషెంట్లకు ఇబ్బంది కలిగించిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.