: ఆయన మాటలు వింటే కశ్మీర్ మరో సిరియా అవుతుంది: మెహబూబా ముఫ్తీ


కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే అమెరికా, చైనాలాంటి మూడో దేశం జోక్యం అవసరమని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు. కశ్మీర్ విషయంలో అమెరికాలాంటి మూడో దేశం తలదూరిస్తే... అది మరో సిరియా అవుతుందని అన్నారు. అమెరికా, చైనాలను వారి పని వారిని చూసుకోమనండి... వాళ్లు మధ్యవర్తిత్వం వహించిన సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మన కళ్ల ముందే కనిపిస్తోందని అన్నారు. సిరియా, ఆఫ్ఘనిస్థాన్ లలో ఏం జరుగుతోందో ఫరూక్ అబ్దుల్లాకు ఏమైనా తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు. భారత్, పాక్ లు కలసి చర్చించుకుంటేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. 

  • Loading...

More Telugu News