: డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడడానికి ఒప్పుకోని సమంత!
టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్న విషయం తెలిసిందే. మరికొంత మంది నటులు మాత్రం ఈ విషయంపై స్పందించమని అడిగినా నోరు విప్పడం లేదు. ఈ రోజు వరంగల్‌లోని హన్మకొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత అక్కడ సందడి చేశారు. అమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతుండగా డ్రగ్స్ అంశంపై మీడియా ఆమె అభిప్రాయాన్ని అడిగింది. అయితే, సమంత మాత్రం ఈ అంశంపై మాట్లాడడానికి నిరాకరించింది. ఆ అంశంపై నో కామెంట్ అని చెప్పింది. తన పెళ్లి గురించి మాత్రం మాట్లాడింది. అక్కినేని నాగ చైతన్యతో అక్టోబర్ 6వ తేదీన గోవాలో తన వివాహం జరగనున్నట్లు చెప్పింది.