: షాకింగ్ న్యూస్... అకున్ సబర్వాల్ కు మాఫియా బెదిరింపులు... రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్!
హైదరాబాదులో డ్రగ్స్ లేకుండా చేయాలని నిర్ణయించుకున్న ఎక్సైజ్ డీఐజీ అకున్ సబర్వాల్ కు బెదిరింపులు వస్తున్నాయి. 10 రోజులుగా డ్రగ్ మాఫియా అకున్ సబర్వాల్ ను బెదిరిస్తోంది. ప్రతిరోజూ ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరించే డ్రగ్ మాఫియా... నిన్నటి నుంచి రూట్ మార్చింది. నీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతారో తెలుసు, ఏ వాహనాల్లో, ఎప్పుడు? ఎక్కడికి? వెళ్తారో కూడా తెలుసు... అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. అకున్ సబర్వాల్ కు వస్తున్న ఫోన్ కాల్స్ పై దర్యాప్తు చేపట్టింది. కాల్స్ ఇంటర్నేషనల్ కాల్స్ అని తేల్చింది. అయితే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? వంటి వివరాలను ఆరాతీయడంలో తలమునకలైంది.