: మంచి స్క్రిప్ట్ దొరికితే ప్రభాస్‌తో మళ్లీ చేసేందుకు రెడీ: తమన్నా
బాహుబలి సినిమాల్లో ప్రభాస్‌తో నటించిన తమన్నా, మంచి స్క్రిప్ట్ దొరికితే ఆయనతో మళ్లీ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. బాహుబలి 2లో చాలా తక్కువసేపు కనిపించిన ఈమె హిందీ, తెలుగు భాషలకు సరిపోయే స్క్రిప్ట్ ఏదైనా ఉంటే చెప్పండని యువదర్శకులను అడుగుతోంది. `ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. ఆయనతో నటించడం నా అదృష్టం. ఇక ముందు కూడా నటిస్తాను కాకపోతే మంచి స్క్రిప్ట్ ఉంటేనే!` అని తమన్నా అంది. ప్రస్తుతం తమన్నా, ప్రభుదేవా సరసన `ఖామోషీ` అనే హిందీ సినిమాలో నటిస్తోంది. అలాగే సందీప్ కిషన్ సరసన తెలుగులో ఓ సినిమాకు ఒప్పుకుంది. `క్వీన్` రీమేక్‌లో తమన్నా నటించనున్నట్లు ఆ మధ్య కథనాలు వచ్చినా అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.