pavan: తల్లిని ఎంతగా ప్రేమిస్తానో పవన్ బాబాయ్ నూ అంతే!: రామ్ చరణ్

రాజకీయ పరిణామాల కారణంగా చిరంజీవి .. పవన్ ల మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టుగా ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఈ కారణంగానే పవన్ -  చరణ్ ల మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం కూడా జరిగింది. చిరూ - చరణ్ ల ఫంక్షన్స్ కి పవన్ రాకపోవడానికి ఈ గ్యాప్ కారణమని చెప్పుకుంటారు.

కానీ తమ మధ్య అలాంటిదేమీ లేదని తాజాగా రామ్ చరణ్ చెప్పాడు. పవన్ బాబాయ్ అంటే తనకి చాలా ఇష్టమనీ .. తనకి ఆయన కొండంత అండ అని అన్నాడు. తానంటే బాబాయ్ కి కూడా అంతే ప్రేమ అనీ .. తమ ఇద్దరి మధ్య బలమైన బంధం ఉందని చెప్పాడు. చాలా విషయాల్లో తనకి ఆయనే స్ఫూర్తి అని అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తాను తన తల్లిని ఎంతగా ప్రేమిస్తానో .. పవన్ బాబాయ్ ను అంతే ప్రేమిస్తానని ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.     
pavan
charan

More Telugu News