: పెళ్లి చేసుకుంటా అనుమతించండి... టాడా కోర్టుకు అబుసలేం అభ్యర్థన
1993 నాటి ముుంబై బాంబు పేలుళ్ల కేసులో ఇటీవలే టాడా కోర్టు దోషిగా ప్రకటించిన అబూసలేం 'పెళ్లి చేసుకుంటాను, అనుమతించండి మహాప్రభో' అంటూ తాజాగా అభ్యర్థన పెట్టుకున్నాడు. ముంబ్రా మహిళతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలన్నది అతడి ఆకాంక్ష. వాస్తవానికి సలేం కంటే ముందే ఆ మహిళ టాడా కోర్టులో పిటిషన్ వేసింది. సలేంను పెళ్లి చేసుకునేందుకు అనుమతి కోరింది. అయితే, తన ఇష్ట ప్రకారం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ముంబై బాంబు పేలుళ్లు సహా డజనుకుపైగా కేసుల్లో విచారణకు గాను సలేంను 2005లో పోర్చుగల్ నుంచి భారత్ కు తీసుకురాగా, అప్పటి నుంచి అతడు జైళ్లలోనే కాలం గడుపుతున్నాడు.