: పూర్ణిమా సాయి తన పేరును అనికా శ్రీగా మార్చుకున్న కారణమిదే!


గత నెల 7వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమై, రెండు రోజుల క్రితం ముంబైలో ప్రత్యక్షమై, తల్లిదండ్రులను చూసేందుకు, వారితో వెళ్లేందుకు ససేమిరా అంటున్న పదో తరగతి విద్యార్థిని పూర్ణిమా సాయి, తన పేరును అనికా శ్రీగా ముంబైలో చెప్పుకోవడం వెనుక ఆసక్తికర కోణం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలన్న బలమైన కోరికతో ముంబై చేరుకున్న పూర్ణిమ, తాను ఇంట్లో ఉన్న వేళ, ఓ హిందీ సీరియల్ ను అమితంగా చూసేది. ఆ సీరియల్ లో హీరోయిన్ పేరు 'అనిక' కావడంతోనే ముంబైలోని ఆశ్రమంలో చేరే ముందు తన అసలు పేరుకు బదులు అనికా శ్రీ అని చెప్పినట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. పూర్ణిమను హైదరాబాద్ కు తెచ్చేందుకు ముంబై వెళ్లిన తల్లిదండ్రులు రిక్తహస్తాలతో వెనుదిరిగి రాగా, నేడు ఇక్కడకు తెచ్చి, కోర్టులో హాజరు పరుస్తామని బాచుపల్లి పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News