: తెలుగు సినీ పరిశ్రమ పరువు తీశారు: నటి శ్రియా రెడ్డి


మత్తుమందులకు అలవాటు పడ్డ కొందరు టాలీవుడ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినీ పరిశ్రమ పరువును తీశారని నటి శ్రియా రెడ్డి వ్యాఖ్యానించింది. చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఓ బొమ్మల దుకాణాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్ మాఫియాలో ఎంతో మంది చిక్కుకోవడం దురదృష్టకరమని అంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. తెలుగులో 'పొగరు' సినిమాతో పాప్యులర్ అయిన ఆమె, హీరో విశాల్ అన్నయ్యను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉందన్న సంగతి తెలిసిందే. తొమ్మిదేళ్ల విరామం తరువాత ఆమె ‘అండావ కానోమ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది.

  • Loading...

More Telugu News