: పార్లమెంటులో వెంకయ్య నాయుడికి వెల్లువెత్తిన అభినందనలు!


భారత ఉపరాష్ట్రపతి రేసులోకి అనూహ్యంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వచ్చారు. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోదీ వెంకయ్య పట్ల మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు పార్లమెంటులో వెంకయ్యకు ప్రముఖ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, వామపక్ష నేత రాజా, కాంగ్రెస్ నేత ఆజాద్ లు వెంకయ్యకు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ,  రాజ్యసభను వెంకయ్య అయితే హుందాగా నడిపిస్తారని అన్నారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, రాజ్యసభలో సింహాన్ని చూస్తారంటూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News