sai dhram tej: కృష్ణవంశీ 'నక్షత్రం'డ్రగ్స్ నేపధ్యమేనట!

షార్ట్స్‌లో చూడండి
ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా 'డ్రగ్స్'కి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వస్తోన్న కృష్ణవంశీ 'నక్షత్రం' కూడా డ్రగ్స్ నేపథ్యంతో కొనసాగే మూవీనే అట.

 డ్రగ్స్ మాఫియా కారణంగా ఓ పోలీస్ ఆఫీసర్ బలైపోతాడట. ఆ హత్య వెనుక గల కారణాలను అన్వేషించే మరో పోలీస్ ఆఫీసర్ గా సాయిధరమ్ తేజ్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ విషయంలో ఆయనకి సహకరించే పాత్రను సందీప్ కిషన్ పోషించాడని చెబుతున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ చేసిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర, ఆయన కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని అంటున్నారు. 'గౌతమ్ నంద' .. 'విఐపి 2' లతో పాటు రంగంలోకి దిగుతోన్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.      
Go Back to Shorts
sai dhram tej

More Telugu News