: న్యూయార్క్‌లో ఉన్నా ఐఫాకు హాజరుకాని అనుష్క శర్మ... విరాట్‌తోనే గడుపుతున్న బాలీవుడ్ భామ!
బాలీవుడ్ తారల సందడితో ఐఫా 2017 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అందరు తారలతో పాటు అనుష్క శర్మ కూడా న్యూయార్క్ వెళితే ఐఫా కోసమే వెళ్లింది అనుకున్నారంతా! కానీ, ఐఫా కంటే తనకు విరాటే కోహ్లీ ముఖ్యం అంటూ న్యూయార్క్ వీధుల్లో ప్రియుడు విరాట్‌తో కలిసి చక్కర్లు కొడుతుందీ భామ. గతేడాది తాను నటించిన `యే దిల్ హై ముస్కిల్` సినిమాకు అనుష్క నామినేట్ అయినా ఐఫా ఉత్సవాలకు హాజరు కాలేదు. అది కూడా న్యూయార్క్‌లోనే ఉండి వేడుకకు హాజరుకాకపోవడంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు.
ఇలా తమ బాలీవుడ్ మిత్రులకు హ్యాండ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం అభిమానులకే కాదు కింగ్ ఖాన్ షారుక్‌ను కూడా అనుష్క నిరాశపరిచింది. తమ కొత్త చిత్రం `జబ్ హ్యారీ మెట్ సెజల్` ప్రచార కార్యక్రమాల్లో షారుక్‌తో పాటు పాల్గొనటం లేదు. పాపం షారుక్ ఒక్కడే సినిమా ప్రచారాల్లో నిమగ్నమైపోయాడు. మరి ఇంత మందిని నిరాశపరిచిన అనుష్క న్యూయార్క్‌లో ప్రియుడు విరాట్‌తో కలసి షాపింగ్, చిన్ననాటి స్నేహితులతో కలసి డిన్నర్, చిన్నచిన్న పార్టీలతో హాలీడేను ఆనందంగా గడుపుతోంది. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు అనుష్క, విరాట్‌లు తమ ఇన్‌స్టాగ్రాం పేజీల్లో అప్‌డేట్ చేస్తూనే ఉన్నారు.