: హైదరాబాదులో కోటి మొక్కలు నాటబోతున్నాం: తలసాని
హరిత తెలంగాణను నిర్మించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారని తెలిపారు. హైదరాబాద్ లో కోటి మొక్కలను నాటబోతున్నామని చెప్పారు. మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని నల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.