: అమర్త్యసేన్ జీవిత కథ `ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్` ట్రైలర్ విడుదల
నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన `ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్` సినిమా ట్రైలర్‌ను దర్శకుడు సుమన్ ఘోష్ ఫేస్‌బుక్‌లో విడుదల చేశాడు. `నిజానికి జూలై 14న మేం సినిమా విడుదల చేయాల్సిఉంది. కానీ కుదరలేదు. అందుకే ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ఇందులో వస్తున్న ఠాగూర్ పద్యాన్ని విక్టర్ బెనర్జీ ఆలపించారు` అని సుమన్ ఘోష్ పోస్ట్ చేశాడు. సీబీఎఫ్‌సీతో పోరాటంలో తమకు మద్దతు పలికిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. `గుజరాత్`, `హిందుత్వ`, `ఆవు` వంటి పదాలను తొలగించాలని కోల్‌కతా సీబీఎఫ్‌సీ వారు ఈ చిత్రానికి అడ్డంకి సృష్టించిన సంగతి తెలిసిందే!
ఇదిలా ఉండగా సర్టిఫికెట్ రాకముందే ట్రైలర్ విడుదల చేయడాన్ని ప్రశ్నిస్తూ సీబీఎఫ్‌సీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీ పంపిన నోటీసును కూడా సుమన్ ఘోష్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. `వారు చెప్పిన పదాలు ట్రైలర్ లో లేకున్నా కూడా నేను చేసిన పని వారికి తప్పుగా కనిపిస్తోంది` అంటూ సుమన్ అసహనం వ్యక్తం చేశాడు.