: 2011 ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్-శ్రీలంకల మ్యాచ్ ఫిక్స్ అయింది: అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు


2011 ప్రపంచకప్ లో భాగంగా భారత్-శ్రీలంకల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్ ఫిక్స్ అయిందని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. గెలవాల్సిన మ్యాచ్ లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను షాక్ కు గురి చేసిందని ఆయన అన్నారు. అప్పుడు కామెంటేటర్ గా తాను భారత్ లోనే ఉన్నానని చెప్పారు.

ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లతో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసిందని... ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే సెహ్వాగ్ (0), సచిన్ (18) వికెట్లను కోల్పోయిందని చెప్పాడు. ఆ సమయంలో శ్రీలంక చాలా పటిష్ఠ స్థితిలో ఉందని... అయితే, ఆ తర్వాత అనూహ్యంగా మ్యాచ్ స్వరూపం మారిపోయిందని తెలిపాడు. శ్రీలంక బౌలింగ్, ఫీల్డింగ్ రెండూ పేలవంగా మారిపోయాయని... దీంతో, భారత్ విజేతగా నిలిచిందని చెప్పాడు. ఆ మ్యాచ్ లో శ్రీలంక ఆటతీరుపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నాడు.

మరోవైపు, రణతుంగ వ్యాఖ్యలను అప్పటి భారత జట్టు సభ్యులు గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాలు ఖండించారు. రణతుంగ ఆరోపణలు తమను ఆశ్చర్యపరిచాయని, ఆయన వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, చూపించాలని అన్నారు. రణతుంగ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫైనల్స్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

  • Loading...

More Telugu News