srinivas: స్టార్ హీరోల మాదిరిగానే రూటు మార్చిన బోయపాటి!

కొంతకాలం క్రితం వరకూ కొత్తగా వచ్చే కథానాయకులు ముందుగా మాస్ ఆడియన్స్ మనసులను గెలవడానికి ప్రయత్నించే వాళ్లు. ఇక స్టార్ హీరోలు కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఆ తరహా సినిమాలు ఎక్కువగా చేసేవారు. కానీ ఇటీవల కాలంలో స్టార్ హీరోల అభిరుచి మారింది. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను చేయడానికి వాళ్లు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

 ఈ నేపథ్యంలో యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన బోయపాటి శ్రీను కూడా తనదైన శైలిని మార్చుకుని, 'జయ జానకి నాయక' సినిమా చేశారు. దాంతో ఆయన కూడా కొత్తదనం కోసం రూటు మార్చుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. యాక్షన్ కథల దిశగా వెళితే .. కొంతమంది హీరోలకి .. ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే పరిమితమైపోవలసి వస్తుంది. అందువలన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతోనే, బోయపాటి రూటు మార్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     
srinivas
rakul

More Telugu News