varun tej: దిల్ రాజు బ్యానర్ వరుణ్ తేజ్ కి కలిసొచ్చేనా?

షార్ట్స్‌లో చూడండి
యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథాబలమున్న చిత్రాలను దిల్ రాజు నిర్మిస్తూ వస్తున్నారు. ఆయన బ్యానర్ పై వచ్చిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ లనే అందుకుంటూ ఉంటాయి. ఈ కారణంగానే ఆయన బ్యానర్లో చేయడానికి యువ హీరోలంతా ఆసక్తిని వ్యక్తం చేస్తుంటారు.

అల్లు అర్జున్ కెరియర్ కి టర్నింగ్ పాయింట్ ను ఇచ్చింది .. సాయిధరమ్ తేజ్ కెరియర్ స్పీడ్ పెంచింది దిల్ రాజు బ్యానరే. అలాంటి ఈ బ్యానర్లోనే వరుణ్ తేజ్ చేసిన 'ఫిదా' రానుంది. ఈ నెల 21వ తేదీన భారీస్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న వరుణ్ తేజ్ కి కూడా ఈ బ్యానర్ కలిసొస్తుందనే ఆశాభావాన్ని వరుణ్ తేజ్ సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఇక శేఖర్ కమ్ములకు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
varun tej
sai pallavi

More Telugu News