: మళ్లీ పుంజుకుంటున్న అల్ ఖైదా.. పేరు కూడా మారింది!
అమెరికా వైమానిక దాడులతో దెబ్బతిన్న ఉగ్ర సంస్థ అల్ ఖైదా గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ సంస్థ మళ్లీ భారత ఉపఖండంలో పుంజుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికా ఉగ్రవాద నిరోధక నిపుణులు తెలిపారు. ముఖ్యంగా బాంగ్లాదేశ్ లో ఈ సంస్థలోకి ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది చివరకల్లా మళ్లీ అల్ ఖైదా అతిపెద్ద ఉగ్రసంస్థగా అవతరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో అయితే ఇంతకు ముందు ఎలా ఉండేదో... తిరిగి అంత బలోపేతమవుతుందని చెబుతున్నారు. అల్ ఖైదా తన పేరును అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్)గా మార్చుకున్నట్టు తెలిపారు.