: కిరణ్ కుమార్ రెడ్డికి పవన్ కల్యాణ్ 'జనసేన' నుంచి పిలుపు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డికి జనసేన నుంచి పిలుపు వెళ్లిందనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైన సమయంలో, ఆయన జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ఎలాంటి ఫలితాలను రాబట్టలేకపోయింది. దీంతో, ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన తన సొంత వ్యాపారాలను చూసుకుంటున్నారు.
మధ్యలో బీజేపీలోకి కిరణ్ చేరబోతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ... అది ఇంత వరకు జరగలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా, స్పీకర్ గా ఆయనకున్న అపారమైన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని జనసేన భావిస్తోంది. పవన్ కల్యాణ్ ఛరిష్మాకు కిరణ్ రాజకీయ అనుభవం తోడైతే సత్ఫలితాలను సాధించే అవకాశం ఉందని అంటున్నారు. జనసేన నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో, పార్టీలో ఆయనకు సమున్నత స్థానం ఉంటుందని... సెకండ్ ప్లేస్ ఆయనదే అని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో కొన్నాళ్లు వేచి చూడాలి.