: భారత గేమింగ్ కంపెనీలో క్రిస్‌గేల్ ఇన్వెస్ట్‌మెంట్!
భారత్‌కు చెందిన ఇయోనా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలో వెస్టిండీస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ కొంత పెట్టుబడి పెట్టాడు. అది ఎంత మొత్తం అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని ఇయోనా ఎంటర్‌టైన్‌మెంట్ కొత్తగా వర్చువల్ గేమింగ్‌లో అడుగుపెడుతోంది. దీని అభివృద్ధి కోసమే క్రిస్‌గేల్ ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా క్రిస్‌గేల్ మాట్లాడుతూ పెట్టుబడి విషయంలో భారత్ వ్యాపారాలకే తన మొదటి ప్రాధాన్యమని అన్నాడు. క్రిస్‌గేల్‌తో పాటు సింగపూర్‌కు చెందిన వెస్టాసియా కంపెనీ కూడా ఇయోనా ఎంటర్‌టైన్‌మెంట్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసింది. తమ మొదటి ఫేజ్ కోసం రూ. 200 కోట్లు అవసరం కాగా క్రిస్‌గేల్, వెస్టాసియా లాంటి వాళ్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారని, త్వరలో తమ బిజినెస్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధి చెప్పారు.