: నేడు అఖిల పక్షం సమావేశం... డోక్లాం వివాదంపై వివరణ ఇవ్వనున్న కేంద్రం


కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన నేడు అఖిలపక్షం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా డోక్లాం సరిహద్దుల్లో చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదంతో పాటు కశ్మీర్‌ అమర్ నాథ్ యాత్ర తాజా పరిస్థితులను రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించనున్నారు.

అలాగే ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా వారు స్పష్టం చేయదల్చారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు వారాలుగా నెలకొన్న డోక్లాం వివాదంతో పాటు, అమర్ నాథ్ యాత్రల విషయంలో అఖిల పక్షాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలంటే ఈ అంశాలపై ఏకాభిప్రాయం చాలా అవసరం. లేని పక్షంలో అధికార పక్షం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News