: మన మధ్య ఉన్న మరో గాంధీ ప్రధాని మోదీ : కేంద్ర మంత్రి మహేశ్ శర్మ


ప్రధాని నరేంద్రమోదీని మరో మహాత్మా గాంధీగా కేంద్ర మంత్రి మహేశ్ శర్మ అభివర్ణించారు. గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంపై రచించిన పుస్తకాన్ని ఈ రోజు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్ శర్మ మాట్లాడుతూ, ఉప్పు సత్యాగ్రహమనేది కేవలం ఒక చిటికెడు ఉప్పు గురించి కాదని, తరతరాలను ప్రేరేపించడం గురించి అని అన్నారు. నేడు ప్రధాని మోదీ రూపంలో మనకు స్ఫూర్తి నిస్తూ మరో గాంధీజీ ఉన్నారని అన్నారు.  గాంధీజీ కలలను నెరవేర్చాలన్నదే మోదీ కల అని 
ఈ సందర్భంగా మహేశ్ శర్మ చెప్పారు.

  • Loading...

More Telugu News