: అరుణాచల్‌లో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి


అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కొండ చరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. పపుంపరే జిల్లాలోని ల్యాప్‌టాప్ గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు ఇళ్లమీద పడడంతో అవి ధ్వంసమయ్యాయి.

శిథిలాల కింది నుంచి మృతదేహాలను వెలికి తీసిన రెస్క్యూ సిబ్బంది, ఇంకా ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారేమోనని గాలిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పేమ ఖండు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పపుంపరే జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

  • Loading...

More Telugu News