: అర్థరాత్రి భారీ శబ్దం... ఉలిక్కిపడ్డ పాతబస్తీ వాసులు
హైదరాబాదులోని పాతబస్తీ భారీ శబ్దంతో ఉలిక్కిపడింది. నగరంలోని అఫ్జల్ గంజ్ లో ఉన్న మహాత్మాగాంధీ బస్ స్టేషన్ సమీపంలోని 220 కేవీ సబ్ స్టేషన్ లో ట్రాన్స్ ఫార్మర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ట్రాన్స్ ఫార్మర్ లోని ఇంటర్నల్ సర్క్యూట్ లోని లోపం కారణంగా మంటలు చెలరేగగా, అక్కడే ఉన్న 40 వేల లీటర్ల ఆయిల్ ట్రాన్స్ ఫార్మర్ కు మంటలంటుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్ భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. దీంతో సమీపంలోని పాతబస్తీ వాసులు ఉలిక్కిపడ్డారు. అయితే 8 ఫైర్ ఇంజిన్లతో చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది వారికి సహకరిస్తున్నారు.