: టీమిండియా ప్రధాన కోచ్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు: షాకిచ్చిన బీసీసీఐ
టీమిండియా ప్రధాన కోచ్ ఎవరు? అనే విషయంపై ఎంతో ఉత్కంఠ రేగిన తరువాత ఈ రోజు బీసీసీఐ ఎట్టకేలకు రవిశాస్త్రిని ఆ పదవికి ఎంపిక చేసిందని మీడియాలో వార్తలు చక్కర్లుకొట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ వార్తపై స్పందించిన బీసీసీఐ తాము ఇంకా కోచ్ పై తుది నిర్ణయం తీసుకోలేదని ప్రకటన చేసింది. రవిశాస్త్రిని ఈ పదవికి నియామించారన్న వార్తను బీసీసీఐ ఖండించింది. ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉందని త్వరలోనే అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది.