: ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ఒత్తిళ్లకు తహసీల్దార్లు లొంగవద్దు: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ
తహసీల్దార్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సూచించారు. కాకినాడ కలెక్టరేట్ లో తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేఈ మాట్లాడుతూ, తహసీల్దార్లపై రాజకీయ ఒత్తిళ్లు కనుక ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని అన్నారు.