: రూ. 50,000 లోపు ఉద్యోగ సంబంధ బహుమతులపై జీఎస్టీ లేదు!
ఉద్యోగి శ్రేయస్సు కోసం కంపెనీలు అందించే క్లబ్ మెంబర్‌షిప్, హెల్త్, ఫిట్‌నెస్ మెంబర్‌షిప్ వంటి బహుమతులపై ఎలాంటి జీఎస్టీ ఉండదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కాకపోతే ఈ బహుమతుల విలువ సంవత్సరానికి రూ. 50,000 మించి ఉండకూడదు. అలాగే ఉద్యోగి యజమాని కోసం చేసే పనులపై కూడా ఎలాంటి జీఎస్టీ ఉండదని తెలిపింది. అలాగే కాస్ట్ టు కంపెనీ (సీ2సీ)లో భాగంగా ఉద్యోగికి గృహ సౌకర్యం కల్పించినా కూడా జీఎస్టీ చెల్లించనక్కరలేదని ఆర్థిక శాఖ చెప్పింది.
జూలై 1 నుంచి అమలైన జీఎస్టీ పన్ను నోటిఫికేషన్‌లో బహుమతులు, సౌకర్యాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ విషయంపై స్పష్టతనిస్తూ ఆర్థిక శాఖ సోమవారం ప్రకటన జారీచేసింది. రూ. 50,000 విలువకి మించి ఉన్న బహుమతులపై ఆయా బహుమతిని బట్టి జీఎస్టీ విధిస్తామని వివరించింది.