: వైసీపీ ప్లీనరీ అక్కడ ఎందుకు నిర్వహించారు?: కళా వెంకట్రావు


అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయొద్దంటూ అదేపనిగా మాట్లాడిన జగన్, మరి, వైసీపీ ప్లీనరీ అక్కడ ఎందుకు నిర్వహించారని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ పార్టీని నడిపిస్తున్నారని, ఆయన దృష్టి అంతా సీఎం కుర్చీ పైనే ఉందని అన్నారు.

కాగా, ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ మాట్లాడుతూ, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైసీపీ విఫలమైందని, అవినీతిపరులంతా కలిసి నీతిపరులవైపు వేలెత్తి చూపుతున్నారని విమర్శించారు. జగన్ ఎలాగూ జైలుకు వెళతారు కనుక, ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే బాగుంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News