: మరింత పడిపోయిన బంగారం, వెండి ధరలు!


అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గడం, స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో ఈ రోజు బంగారం ధర పడిపోయింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 99.9% స్వ‌చ్ఛ‌త‌గ‌ల‌ ప‌ది గ్రాముల బంగారం ధ‌ర‌ రూ.250 త‌గ్గి 28,900 గా న‌మోదుకాగా, 99.5% స్వచ్ఛమైన బంగారం ధ‌ర కూడా రూ.250 త‌గ్గి 28,750కు చేరింది. మ‌రోవైపు వెండి ధ‌ర కూడా రూ. 800 లు త‌గ్గి కిలో రూ.37,400 గా న‌మోదైంది. ఎంసీఎక్స్‌ మార్కెట్ లోనూ బంగారం ధ‌ర రూ.339 ప‌డిపోయి ప‌ది గ్రాముల ప‌సిడి రేటు రూ.27,777గా న‌మోదైంది.            

  • Loading...

More Telugu News