: పోగొట్టుకున్న ఫోన్లు, చోరీ అయిన ఫోన్లకు సేవలు బంద్.. ఐఎంఈఐ నంబర్ మారిస్తే జైలే!
మనం పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు, చోరీకి గురైన ఫోన్లకు సేవలను పూర్తిగా నిలిపివేసేందుకు సరికొత్త వ్యవస్థను ప్రభుత్వం సిద్ధం చేసింది. సిమ్ కార్డునే కాదు, ఐఎంఈఐ నంబరును మార్చినా ఆ ఫోన్లు పనిచేయకుండా ఉండేలా ఏర్పాట్లను చేస్తోంది. ఈ మేరకు పూణెలోని తమ కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ 6 నెలల పాటు ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టిందని టెలికామ్ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. ఐఎంఈఐ సంఖ్యను మార్చడాన్ని శిక్షార్హమైన నేరంగా గుర్తించి, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలను తీసుకురానున్నట్టు టెలికాం శాఖ తెలిపింది.