: సౌదీలో హైదరాబాదు మహిళకు వేధింపులు... భర్తకు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పిన భార్య!


సౌదీ అరేబియాలో ఓ తెలుగు మ‌హిళ న‌ర‌కం అనుభ‌విస్తోంది. ఈ విష‌య‌ంపై ఈ రోజు త‌న భ‌ర్త‌కు ఫోన్ చేసి చెప్పింది. త‌న ఇద్ద‌రు పిల్ల‌లు కూడా త‌ల్లి కోసం ఆందోళ‌న చెందుతున్నార‌ని ఆ మ‌హిళ భ‌ర్త ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు. తెలంగాణ స‌ర్కారు స్పందించి త‌మ‌కు సాయం చేయాల‌ని కోరుతున్నాడు. మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే, హైద‌రాబాద్‌లోని కుషాయిగూడ సోనియాగాంధీ నగర్‌కు చెందిన మంజుల (36) ఓ ఏజెంట్‌ సాయంతో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లింది. ఈ రోజు ఆమె త‌న భ‌ర్త‌కు ఫోన్ చేసి త‌నను ఆ దేశంలో బాత్‌రూంలో బంధించి హింసిస్తున్నారని క‌న్నీరు పెట్టుకుంది. త‌న భార్య భార‌త్‌కు వ‌చ్చేలా చేయాల‌ని ఆమె భ‌ర్త మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.       

  • Loading...

More Telugu News