: నైజాంలో రూ. 20 కోట్లు వ‌సూలు చేసిన డీజే


నైజాం ప్రాంతంలో 20 కోట్లు వ‌సూలు చేసిన సినిమాలు చాలా తక్కువ. దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాతో అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో విజ‌యం సాధించాడు. నిర్మాత‌లు విడుద‌ల చేసిన అధికారిక లెక్క‌ల ప్ర‌కారం నైజాం ప్రాంతంలో డీజే సినిమా 20 కోట్లు వ‌సూలు చేసింది. ఇక ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సినిమాల విషయంలో మాత్రం ఈ ప్రాంతంలో 20 కోట్లు వ‌సూలు చేయ‌డం ఇది రెండోసారి. ఇంత‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ నటించిన 'గ‌బ్బ‌ర్ సింగ్' సినిమాతో హ‌రీష్ ఈ రికార్డు సాధించాడు. విమ‌ర్శ‌కుల మాట‌లు, రివ్యూలు ఎలా ఉన్నా డ‌బ్బుల వ‌సూళ్ల విష‌యంలో మాత్రం డీజే ముందుకు దూసుకెళ్తూనే ఉంది.

  • Loading...

More Telugu News