: పెళ్లి కూతురు రాలేదంటూ కేసుపెట్టిన వరుడు... 2 లక్షల పరిహారం ఇప్పించాలంటూ డిమాండ్!


ముహూర్తం సమయం మించిపోతున్నప్పటికీ మండపానికి రాని వధువుపై వరుడు ఫిర్యాదు చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ముంబైకి చెందిన శ్రీకాంత్‌ కాంబ్లేకు పూజా భండారి అనే యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. వివాహ ముహూర్తం దగ్గర పడడంతో శ్రీకాంత్‌ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసుకున్నాడు. వివాహ సమయం వచ్చింది. కల్యాణ మండపంలో వధువు కోసం ఎదురు చూడడం ప్రారంభించాడు.

ముహూర్తానికే కాదు, అసలు కల్యాణ మండపానికే వధువు రాలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన శ్రీకాంత్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వివాహం చేసుకుంటానని మోసం చేసిందని ఆరోపించాడు. వివాహం చేసుకుంటానని చెప్పడంతో తాను 2 లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఏర్పాట్లు చేశానని, తన డబ్బులు తనకు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. పోలీసులు కబురంపడంతో మరుసటి రోజు అదే పోలీస్ స్టేషన్ కు తన ప్రియుడితో కలిసి చేరుకున్న వధువు... తన తల్లిదండ్రులు బలవంతంగా తన వివాహం శ్రీకాంత్ తో నిశ్చయించారని, అది నచ్చక పెళ్లి రోజు పారిపోయానని తెలిపింది.

  • Loading...

More Telugu News