: మతపరమైన గొడవలకు కారణమైన ఫేస్‌బుక్ పోస్ట్... రంగంలోకి బీఎస్ఎఫ్
కోల్‌కతాలోని బదూరియా ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ మతపర గొడవలకు దారితీసింది. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ ఆ బాలుడు పెట్టిన పోస్ట్ కారణంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. వీటిని కట్టడి చేయడానికి 400కు పైగా పారామిలటరీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఆయన మాటలపై ఆమె స్పందిస్తూ, `గవర్నర్ నాతో మాట్లాడిన తీరు ఒక పక్కా మండల స్థాయి బీజేపీ నాయకుణ్ని గుర్తుచేస్తోంది. ఆయన మాట్లాడిన మాటలకు నాకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనిపించింది. ఇది చాలా పెద్ద అవమానం` అన్నారు. ఇదిలా ఉండగా తాను కేవలం సమాచారం మాత్రమే అందించానని, ముఖ్యమంత్రి చెబుతున్న మాటలేం అనలేదని గవర్నర్ తెలిపారు.