: మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు అనుమతించకూడదని నిర్ణయించాం: ఏపీ మంత్రి జవహర్
మద్యం దుకాణాలకు దేవుడి పేర్లు అనుమతించకూడదని నిర్ణయించామని మంత్రి జవహర్ తెలిపారు. మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతపై మంత్రి వర్గంలో చర్చించామని, మహిళల మనోభావాలను అర్థం చేసుకున్నామని చెప్పారు. వాస్తవ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని, వర్గాల మధ్య ఉన్న విభేదాలను వివాదాలుగా మార్చి సమస్యలు సృష్టించవద్దని కోరారు. కొత్త నిబంధనలపై రేపు జీవో విడుదల చేస్తామని, 8 రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ఏపీలోనూ అమలు చేస్తామని చెప్పారు.